రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

frame రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

Seetha Sailaja
క్రేజీ హీరోయిన్ రష్మిక మ్యానియా ఇప్పుడు దక్షిణాది సినిమా రంగాన్ని మాత్రమే కాకుండా బాలీవుడ్ ను కూడ తాకింది. దీనికితోడు ఆమె నటిస్తున్న అనేక సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా నిర్మాణం జరుపుకుంటున్న పరిస్థితులలో ఆమె క్రేజ్ దేశ వ్యాప్తంగా వ్యాపించడం ఖాయం అని అంచనాలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదల కాబోతున్న ‘పొగరు’ ఆమెకు ఊహించని సమస్యలు తెచ్చిపెడుతోంది. ఒకనాటి హీరో ఈనాటి క్యారెక్టర్ యాక్టర్ అర్జున్ మేనల్లుడు ధృవ హీరోగా నటిస్తున్న మూవీ ఇది. ఈమూవీని కన్నడ తెలుగు తమిళ భాషలలో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. భారీ యాక్షన్ మూవీగా విడుదల అవుతున్న ఈమూవీ మాస్ మూవీ అన్న ప్రచారం జరుగుతోంది.


ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కు ఆమె డుమ్మా కొట్టడంతో ఈ మూవీలో నటించడం రష్మికకు ఇష్టం లేదా లేదంటే ఈమూవీ తన స్థాయికి సరిపోదని ఈ మూవీ ప్రమోషన్ కు దూరంగా ఉంటోందా అంటూ కన్నడ మీడియా ఆమె పై వార్తలు వ్రాస్తోంది. అంతేకాదు కన్నడ హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక కన్నడ పరిశ్రమను చిన్న చూపు చూస్తోంది అంటూ ఆమె పై కన్నడ మీడియా విమర్శలు చేస్తోంది.


అయితే ఈ విమర్శలకు రష్మిక ఏమాత్రం స్పందించకుండా తన సినిమాల బిజీలో తాను ఉంది. ‘కిరిక్ పార్టీ’ హీరోయిన్ గా కన్నడ సినిమా పరిశ్రమకు పరిచయం అయి ఆ సినిమా హీరోతో ప్రేమాయణం సాగించి ఆతరువాత ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి ఆపై తెలుగులో ఆమెకు విపరీతమిన అవకాశాలు వస్తూ ఉండటంతో ఆ ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకున్న సందర్భంలో కూడ రష్మిక పై కన్నడ మీడియా విపరీతమైన విమర్శలు చేసింది. అయితే ఆమె తన కెరియర్ ను తన పారితోషికాన్ని తప్పించి మరే విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేదు. దీనితో ‘పొగరు’ మూవీ ప్రమోషన్ రష్మిక లేకుండానే కొనసాగుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: