వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ హీరో..!

kalpana
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య కథానాయకుడిగా, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో అల్లరి నరేష్.
అల్లరి నరేష్ కామెడీతో పాటు ఎమోషనల్ పర్‌ఫార్మర్‌గా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ నట వారసునిగా "అల్లరి" మూవీ తో సినీ ప్రయాణం మొదలుపెట్టి సక్సెస్ ఫుల్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అల్లరి నరేష్ కు చాలా కాలం నుండి చెప్పుకోదగ్గ విజయం లభించలేదు.
అల్లరి నరేశ్‌ ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి తనకు పేరు తెచ్చిపెట్టిన కామెడీ సినిమాలపైనే దృష్టి పెట్టి "బంగారు బుల్లోడు" గా జనవరి 23న ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది.

అల్లరి నరేష్ విభిన్న పాత్రల్లో నటించిన  'నేను, గమ్యం, శంభో శివ శంభో, వంటి  సినిమాల్లో నరేశ్‌ లో కామెడీ ఒక్కటే కాదు అన్ని పాత్రలు చేయగలడని నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం అదే కోవలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ  "నాంది" ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్రలో నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ మూవీకి సతీష్‌ వేగేశ్న నిర్మింతగా,
కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల  దర్శకత్వం వహించాడు.

"నాంది"  మూవీ టీజర్ లో నరేష్  జైలులో న‌గ్నంగా కనిపించి ఈ చిత్ర వైవిధ్యంపై భారీ అంచనాలు క్రియేట్  చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే అల్లరినరేష్ ఈ మూవీలో అద్భుతంగా నటించి చాలా కాలం తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. తొలి భాగంలో కథ అనేక మలుపు తిరుగుతూ ప్రేక్షకుడిని థ్రిల్‌కు, భావోద్వేగానికి గురి చేస్తుంది."నాంది' చిత్రం లోసెక్షన్ 211 గురించిన క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా దర్శకుడు విజయ్ కనకమేడల అద్భుతంగా కథను రూపొందించాడు. ఈ మూవీ అల్లరి నరేష్ కెరీర్ లోనే ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో నరేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: