వామ్మో.. ఎత్తుకుని గిర గిరా తిప్పేసిన అల్లరి నరేష్.. షాకైనా రోజా..?
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది నాంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ ఇక జబర్దస్త్ కమెడియన్స్ చేసిన కామెడీ కి పొట్టచెక్కలయ్యేలా నవ్వడమే కాదు తనదైన శైలిలో జడ్జిమెంట్ కూడా ఇచ్చాడు అల్లరి నరేష్. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే కేవలం గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ కమెడియన్స్ చేసిన కామెడీ ఎంజాయ్ చేయడమే కాదు ఇక లాస్ట్ లో జడ్జిగా ఉన్న రోజా తో కలిసి డాన్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
కొద్దిసేపటి వరకు జడ్జి రోజా తో డాన్స్ చేసిన అల్లరి నరేష్ ఆ తర్వాత రోజా ఊహించని విధంగా ఒక్కసారిగా అమాంతం జడ్జి రోజాను ఎత్తుకున్నాడు. అంతటితో ఆగకుండా గిరగిరచుట్టూ తిప్పేశాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ ఒక్కసారిగా అలా ఎత్తుకోవడంతో జడ్జి రోజా షాక్ అయింది. ఇక జడ్జ్ రోజా ని కిందికి దించిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన రోజాతో సినిమా చేయలేకపోయానని కానీ ఎప్పుడూ ఆమె పక్కన ఉన్న తనకు హీరోయిన్ లాగానే కనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు అల్లరినరేష్. ఇక వెంటనే స్పందించిన రోజా చిన్నప్పుడు నేను అల్లరి నరేష్ ను ఎత్తుకుంటే ఇక ఇప్పుడు నన్ను ఎత్తుకుంటున్నాడు అంటూ పంచ్ వేస్తుంది.