ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

VUYYURU SUBHASH
స్టార్ హీరోలు, హీరోయిన్లు.. సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూస్తే ఒక్కోసారి వారిని ఈజీగా గుర్తు ప‌ట్టేసే ఛాన్స్ ఉంటుంది. కొంద‌రు మాత్రం చిన్న‌ప్ప‌ట‌కి... ఇప్ప‌ట‌కీ పూర్తిగా మారిపోయి ఉంటారు. ఇక ఈ ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగానే ఉందని అనుకుంటున్నారా ? ఆ మె ఓ స్టార్ హీరోయిన్‌. సిల్వ‌ర్ స్క్రీన్ మీద సౌత్‌లో ప‌లు భాష‌ల్లో ప‌లువురు స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించింది. తెలుగు , త‌మిళ‌... మ‌ళ‌యాళం భాష‌ల్లో ఆమెకు సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఉన్నాయి.

మ‌రి ఈ పాప ఎవ‌రో అనుకుంటున్నారా ఆమె తెలుగు స్టార్ హీరోయిన్ అనుపమ. మ‌ళ‌యాళీ అయిన అనుప‌మ త‌న చేప క‌ళ్లతో అంద‌రిని మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇటీవ‌ల ఆమెకు తెలుగులో మంచి అవ‌కాశాలు లేక‌పోయినా ఒక్క ఛాన్స్ అయినా రాక‌పోదా ? అని ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇక అనుప‌మ చిన్న‌ప్ప‌టి పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక అనుప‌మ కు తెలుగులో చివ‌రిగా బెల్లంకొండ హీరోతో చేసిన రాక్ష‌సుడు సినిమా మాత్ర‌మే హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమెకు ఇక్క‌డ ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా వాటిని ఉప‌యోగించు కోలేక‌పోయింది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుప‌మ క‌రోనా త‌ర్వాత త‌న లైఫ్ స్టైల్ ను చాలా వ‌ర‌కు మార్చేశారు. ఈ టైంలోనే ఆమె స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. తాజాగా ఆమె చిన్న‌ప్ప‌టి ఫొటో ఇన్ స్టాలో పెట్ట‌డంతో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: