రామ్ చరణ్ తో గొడవలపై నోరు విప్పిన ఉపాసన...?

VAMSI
" data-original-embed="" >

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ కెరీర్ ఆరంభమయినప్పటి నుండి మంచి కథలను ఎంచుకుని మెగా కాంపౌండ్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకుపోతున్నాడు. అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అడుగు ముందుకేశాడని చెప్పాలి. ఈయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనమరాలు అయినటువంటి ఉపాసనని అయిదు సంవత్సరాలు ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె కూడా అపోలో హాస్పిటల్స్ లో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇప్పుడు మెగా కోడలుగా ఉన్న కొణిదెల ఉపాసనకు మెగా అభిమానులలో మంచి ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ ఫ్యామిలిలో కూడా అందరితో కలిసి హ్యాపీగా ఉంటోంది. అంతే కాకుండా ఉపాసన తనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను మరియు సూత్రాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహనా కల్పిస్తోంది. మరియు రామ్ చరణ్ అలాగే చిరంజీవి కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా ఉపాసనే స్వయంగా సామజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తూ వస్తోంది. ఈమెకు స్వంతంగా ప్రత్రికలు కూడా ఉన్నాయి. వీటిని నిర్వహించేందుకు అప్పుడప్పుడు సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచేది. నిన్న జరిగిన వాలెంటైన్స్ డే సందర్భంగా రామ్ చరణ్కు మరియు ఉపాసనకు మధ్య జరిగిన ప్రేమ విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

ఇప్పటికీ మాకు పెళ్లయి 8 సంవత్సరాలు కాగా, మేము ఇద్దరం ఎన్నో సార్లు గొడవలు పడ్డ విషయాన్ని తెలియచేసింది. సాధారణంగా భార్య భర్తల మధ్యన గొడవలు రావడం సహజమే అని చెప్పింది. మా మధ్య జరిగిన గొడవలన్నీ చిలిపి తగదలని, వాటిని పెద్దగా పట్టించుకునే అవసరం కూడా లేదని వివరించి చెప్పింది. అంతేకాదు 8 ఇయర్స్ లో వచ్చిన ఒక ప్రేమికుల దినోత్సవాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. మేము ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే బహుమతులకన్నా మేము ఇద్దరం గడిపిన ఆనంద క్షణాల గురించే ఎక్కువగా ఇష్టపడతాము.  మా మధ్య బహుమతులకున్న ఒకరితో ఒకరు గడిపిన అపురూప క్షణాలంటేనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: