మెగా ఉప్పెన‌.... 2 రోజుల‌కే బాక్సాఫీస్ బ‌ద్ద‌లు

frame మెగా ఉప్పెన‌.... 2 రోజుల‌కే బాక్సాఫీస్ బ‌ద్ద‌లు

VUYYURU SUBHASH
మెగాస్టార్ మేన‌ళ్లుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా ఉప్పెన క్రియేట్ చేస్తున్నాడు. క‌రోనా వెలిశాక వ‌స్తోన్న సినిమాలు ఒక్కొక్క‌టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతున్నాయి. తాజాగా వ‌చ్చిన ఉప్పెన వ‌సూళ్లు చూశాక ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్‌లో ఉన్నాయి. కంటెంట్‌లో ద‌మ్ము ఉంటే పాత హీరో, స్టార్ హీరో .. కొత్త హీరో అన్న తేడా లేకుండా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డ‌తార‌న్న‌ది డిసైడ్ అయ్యింది. క‌రోనా వ‌చ్చాక ఇండ‌స్ట్రీ వాళ్లు భ‌య‌ప‌డ‌డంతో పాటు థియేట‌ర్ల మ‌నుగ‌డ‌పైనా ప్ర‌భావం చూపించింది. అయితే ఇప్పుడు ఉప్పెన వ‌సూళ్లు చూశాక ఈ సినిమా టాక్‌ థియేటర్ల భవిష్యత్ పైనా భరోసా పెంచింది.

మొదటి రోజే 10 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది ఉప్పెన. పాత డెబ్యూ ఓపెనింగుల రికార్డులన్నింటికి పాత రేసింది. ఈ క్ర‌మంలోనే రెండో రోజు కూడా ఏకంగా మ‌రో రు. 9 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ మేర‌కు మైత్రీ మూవీస్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఓవ‌రాల్‌గా చూస్తే రెండు రోజుల్లో ఉప్పెన నైజాంలో  5.75 కోట్లు - వైజాగ్ 2.67 కోట్లు  - ఈస్ట్ లో 1.63 కోట్లు - వెస్ట్ లో  1.13 కోట్లు - కృష్ణ 1.10 కోట్లు - గుంటూరు 1.42 కోట్లు - నెల్లూరు 0.58 కోట్లు - సీడెడ్ 2.45 కోట్లు వసూలు చేసింది.

ఏపీ , తెలంగాణ‌లో ఉప్పెన‌కు రెండు రోజుల‌కు రు. 16. 73 కోట్ల వ‌సూల్లు వ‌చ్చాయి. విదేశాల నుంచి 70 లక్షలు - కర్ణాటక నుంచి 86 లక్షలు - తమిళనాడు నుంచి 30 లక్షలు - రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు వసూలు చేసింది. ఉప్పెన టోటల్ గా రెండ్రోజులకు 18.77 కోట్లు అంటే సుమారు 19 కోట్లు వసూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్ ఎన్నో రికార్డుల‌ను తిర‌గేసి త‌న పేరిట లిఖించుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: