ఉప్పెన హీరోయిన్ వయసు ఎంతో తెలుసా..అప్పుడే దిగిందా..?
ఇక ఈ సినిమా తో హీరోయిన్ కృతి శెట్టి కూడా టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా హిట్ లో వైష్ణవ్ తరువాత మంచి పాత్ర పోషించింది కృతి.. అందం అభినయం తో పాటు లుక్స్ కూడా బాగా ఉండడంతో ఆమెను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ఈమెను స్టార్ హీరోయిన్ చేయడానికి టాలీవుడ్ కూడా ప్రయత్నిస్తుంది.. తమ సినిమాల్లో పెట్టుకోవడానికి లైన్ లో నిల్చుంటారు.. ఉప్పెన రిలీజ్ అయితే అమ్మాయి డేట్స్ దొరకవు అంటూ చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన మాటలు అక్షరాలా నిజం అవుతున్నాయి. నిజంగానే ఈ భామ డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి.
అంతేకాదు రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇంత సంచలనాలు రేపుతున్న కృతి శెట్టి వయసు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ భామకు ఎంత వయసు ఉంటుంది.. చూడ్డానికి మరీ చిన్న పిల్లలా ఉంది కదా అంటూ ఆసక్తి మొదలైంది. నిజంగానే కృతి చిన్న పిల్లే. ఈమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003లో జన్మించింది కృతి శెట్టి. ప్లస్ టూ చదువుతున్న ఈ భామకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్లోనూ నటించింది. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.