బెల్లంకొండకు హీరోయిన్ లు దొరకడం లేదా.?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. మొదటి సినిమా అల్లుడు శ్రీను కు యావరేజ్ టాక్ రావడంతో బెల్లం కొండకి డెబ్యూ సినిమాకే గుర్తింపు వచ్చింది. ఇక తరవాత వరుస పెట్టి సినిమాలు తీసాడు. వాటిలో రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "రాక్షసుడు" కు హిట్ టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా సంక్రాంతి కి విడుదలైన "అల్లుడు అదుర్స్" సినిమా ప్రేక్షకులు బెదుర్స్ అనే రేంజ్ లో ఉందంటూ రివ్యూస్ వచ్చాయి. కానీ సినిమా సూపర్ అని కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయని అల్లడు శ్రీను తండ్రి నిర్మాత సురేష్ బాబు సక్సెస్ మీట్ పెట్టి మరీ అందరికీ వినిపోయించేలా చెప్పారు. ఇదిలా ఉండగా సురేష్ బాబు కొడుకు సాయి శ్రీనివాస్ కెరీర్ గురించి ఎక్కడా కాంప్రమైస్ అవ్వలేదు. మొదటి సినిమానే మాస్ డైరెక్టర్ వివి.వినాయక్ తో ఇప్పించాడు. ఇక సినిమాల దర్శకులే కాకుండా హీరోయిన్ ల విషయంలోనూ కాంప్రమైస్ అవ్వలేదు. టాలీవుడ్ లో టాప్ లో ఉన్న సమంత హీరోయిన్ గా నటించగా.. తమన్నా నాతో ఐటెమ్ సాంగ్ కి సాయి స్టెప్పులేసాడు. ఆ తరవాత సినిమాల్లోనూ టాప్ హీరోయిన్ లు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లతో నటించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం కూడా బెల్లం అన్న టాప్ హీరోయిన్ లను సంప్రదిస్తున్నారట. ఇప్పటికే శ్రద్ధాకపూర్, దిశ పటాని, అనన్య పాండే, కియారా అధ్వాని లను సంప్రదించగా వాళ్ళు త్రియస్కరించినట్టు తెలుస్తోంది. దాంతో రీమేక్ సినిమాకు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ దొరకటం అంటే పెద్ద సమస్యే అని తెలుస్తుంది. మరి  బెల్లంకొండ కొత్త హీరోయిన్ తో వెళతారా లేదంటే ఎలాగైనా టాప్ హీరోయిన్  లనే సెట్ చేస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: