F3 స్టోరీ లీక్.. అనీల్ ఈసారి అందుకే అంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడా..?

shami
వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2..  అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. అనీల్ రావిపుడి మార్క్ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో ఒకప్పటి వింటేజ్ వెంకటేష్ ను గుర్తుచేశాడు డైరక్టార్. వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్.. తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ అన్ని కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ షూటింగ్ జరుగుతుంది.

ఈసారి అంతకుమించి అన్నట్లు అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఆగస్టు 27 న ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ కథ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ లో తోడల్లుళ్లు గా నటిస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ ల భార్యలు అతిగా చేసే ఖర్చుల కారణంగా పీకల్లోతు అప్పులలో కూరుకుపోతారు.

ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక హోటల్‌ను నడుపుతారని.. ఆ హోటల్ నడుపుతూ వారు ఎలాంటి కష్టాలు పడ్డారనేది కామెడీ గా అనిల్ చూపించబోతున్నాడట. మరి ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ కథ మతం సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సీక్వెల్ ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎఫ్2 హిట్ అవడంతో ఈ సీక్వల్ మీద మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ నారప్ప, వరుణ్ తేజ్ గని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: