ల్యాప్ టాప్ లో నుండి పూరి.. ఇది రాకెట్ రాఘవకే సాధ్యం..?
ఇక సాధారణంగా జబర్దస్త్ ప్రోమో లో ఎన్నో వినూత్నమైన పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ మొదలైన మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ లో కొనసాగుతూ జబర్దస్త్ కార్యక్రమంలో మోస్ట్ సీనియర్ గా మారిపోయారు రాకెట్ రాఘవ. ఇక మొదటి నుంచి కూడా తనదైనకామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే మరోసారి రాకెట్ రాఘవ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నారు అన్నది అర్థం అవుతుంది.
అయితే రాకెట్ రాఘవ స్కిట్ లో ఎప్పుడూ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే సాఫ్ట్వేర్ భర్త ఫ్యాక్షనిస్ట్ భార్య కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అయితే ఫ్యాక్షనిస్ట్ భార్యకు ఒక తమ్ముడు ఉంటాడు. సాఫ్ట్వేర్ భర్త గా ఉన్నా రాకెట్ రాఘవ లాప్టాప్ లో పని చేసేందుకు వెళ్తున్న సమయంలో బావ.. ఈ ల్యాప్టాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగితే మనకు ఏం కావాలన్నా అది ఇస్తుంది అంటూ రాకెట్ రాఘవ చెబుతాడు.. అయితే ఓ ప్లేట్ పూరి ఇవ్వమను బావా అంటూ అడగడం తో రాకెట్ రాఘవ షాక్ అవుతాడు. పూరి లేకపోతే వడా ఇవ్వమను అంటూ అడుగుతాడు దీంతో అందరూ నవ్వుకుంటారు.