బూతు ప్రశ్నకు కళ్లు బైర్లు కమ్మే సమాధానం ఇచ్చిన పూజ హెగ్డే !

Seetha Sailaja

ప్రస్తుతం పూజ హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానాన్ని అందుకుంది ఈ స్థానం కోసం రష్మిక చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నా  పూజ హెగ్డే మ్యానియా ముందు ఆమె నిలబడలేకపోతోంది. ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ హిటాకావడంతో పీక్ లెవల్ కి వెళ్ళిన పూజ క్రేజ్ ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విడుదల తరువాత ఆమె రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోతుంది అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇలాంటి పీక్ స్థానంలో ఆమె ఉన్నప్పటికీ ఆమె తరుచు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది భామ. ముఖ్యంగా ఇన్ ష్టా గ్రామ్ లో పూజ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమధ్య తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ తన అభిమానులు అడిగిన అనేక చిలిపి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.


ఇలాంటి పరిస్థితులలో ఒక నెటిజన్ మరొక అడుగు ముందుకు వేసి పూజా హెగ్డేను తన నగ్న చిత్రాన్ని పోస్ట్ చేయమని అడిగాడట. ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆవేశ పడకుండా ఆ నెటిజన్ కు దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన నేక్డ్ చిత్రాన్ని అడిగినప్పటికీ ఏ విధమైన కామెంట్ చేయకుండా తన రెండు పాదాలను ఫొటో తీసి ఆ చిత్రాన్ని పోస్ట్ చేసింది పూజా. ఈ సమాధానానికి ఆ నెటిజన్ మైండ్ బ్లాంక్ అయిందట.


వాస్తవానికి ఇలాంటి చిలిపి ప్రశ్నలను చాల లైట్ గా తీసుకుని హీరోయిన్స్ వదిలేస్తూ ఉంటారు. అయితే ఒక షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చి పూజ తన రేంజ్ ని మళ్ళీ చూపెట్టుకుంది అంటూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడలింగ్ రంగం నుండి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన పూజకు ఎవరితో ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన విషయం. అందుకే ఇలాంటి సమాధానం ఆమె ఇవ్వగలిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: