ఎవరు ఊహించని మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రం.. ఇక రచ్చ రచ్చే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం సినిమా ఒకటి డిస్కషన్స్ లో ఉందట. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని అంటున్నారు. త్రివిక్రం గురువుగా భావించే సరవంతి రవికిశోర్ రెడ్ ఈవెంట్ లో ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం అందరికి అర్ధమైంది. అయితే ఆ చొరవతోనే రామ్, పవన్ కలిసి సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రవికిశోర్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్ అందుకున్న రామ్ రానున్న సినిమాలతో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.
పవన్, రామ్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. త్రివిక్రం డైరక్షన్ లోనే మెగా మల్టీస్టారర్ అదేనండి చిరు, పవన్ ఉంటుందని అంటున్నారు. మరి ఒక్క త్రివిక్రం ఇంతమందితో ఎలా మల్టీస్టారర్ చేస్తాడు. ఊరకనే అనుకుంటే సరిపోదు ఆ అంచనాలకు తగినట్టుగా కథ సిద్ధం చేసుకోవాలి కదా అని అంటున్నారు సినీ జనాలు.