కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్.. పెళ్లి తర్వాత బయటపెట్టేస్తున్న అమ్మడు..!

shami
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈమధ్యనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు గౌతం కిచ్లుని పెళ్లాడిన అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. చేతులో ఉన్న సినిమాలన్ని పూర్తి చేశాక నెక్స్ట్ సినిమాలకు కూడా ఏమాత్రం ఆలోచించకుండా సైన్ చేస్తుందట కాజల్. ఇక సినిమాలతో పాటుయ్గా మధ్య మధ్యలో ఫోటో షూట్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కరెక్ట్ గా చెప్పాలంటే పెళ్లి తర్వాత కాజల్ మరింత రెచ్చిపోతుందని చెప్పాలి.

లేటెస్ట్ గా చుక్కలు చుక్కలు టాప్ తో ఓర కళ్లతో అమ్మడు ఫోటో షూట్ కాజల్ ఫ్యాన్స్ కు కిక్ ఎక్కిస్తుంది. కాజల్ ఈ ఫోటోస్ చూస్తే ఆమె ఎప్పుడూ లేనంత హాట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. తన భర్త నుండి పూర్తి ఫ్రీడం ఉండటం వల్ల పెళ్లి అయ్యిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరి రెచ్చిపోతుంది కాజల్. ఇదే ఊపు సినిమాల్లో కూడా కొనసాగిస్తే మాత్రం కాజల్ కు పెళ్లి అయిన విషయాన్ని కూడా మర్చిపోతారు. పెళ్లి అయినా కాకున్నా కాజల్ ఎప్పుడూ శృతిమించి ఎక్స్ పోజింగ్ చేయలేదు. అయితే ఇక మీదట దానికి కూడా అడ్డు గోడలు లేవని చెబుతుందట.

తెర మీద తనని ఎంత అందంగా చూపించాలనుకుంటే తాను అంత అందంగా కనిపిస్తా.. ఇక మీద గ్లామర్ షో విషయంలో కూడా అడ్డు చెప్పేది లేదని హింట్ ఇస్తుందట కాజల్. పెళ్లి తర్వాత ఎవరైనా గ్లామర్ షో చేయకుండా వచ్చిన అవకాశాలు చేస్తారు కాని అమ్మడు మాత్రం తన రూటే సెపరేట్ అనేలా పెళ్లి తర్వాత గ్లామర్ షోకి సై అనేస్తుంది. మొత్తానికి కాజల్ ఇలా రెచ్చిపోవడం ఆమె ఫ్యాన్స్ కు థ్రిల్ అయ్యేలా చేస్తుంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: