F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!

shami
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన సూపర్ హిట్ మూవీ F2. ఆ సినిమా సీక్వల్ గా ఎఫ్3 వస్తుంది. F2కి పనిచేసిన చిత్రయూనిటే F3కి పనిచేస్తుంది. f3 ట్రిపుల్ ఫన్ తో వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే మొదలైంది. అయితే ఇలా మొదలైందో లేదో అలా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. f2 తో వింటేజ్ వెంకటేష్ ను పరిచయం చేసిన అనీల్ రావిపుడి ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ రేంజ్ ఏంటన్నది చూపిస్తారట.
వరుణ్ తేజ్ ను కూడా సేమ్ ఎనర్జీతో చూపిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ జరిగిపోయిందని తెలుస్తుంది. సూపర్ హిట్ కాంబో కాబట్టి f3 ను వెనకడుగు వేయకుండా కొనేశారట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో ఎఫ్3 ఫ్యాన్సీ డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇమేజ్ కు తగినట్టుగానే f3 24 కోట్ల డీల్ సెట్ చేసుకున్నారట. అమేజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ 12 కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక జీ తెలుగు శాటిలైట్స్ సొంతం చేసుకుందని సమాచారం.
అంటే సినిమాకు ముందుగానే పాతిక కోట్లు వచ్చేశాయన్నమాట. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు కాబట్టి అనీల్ రావిపుడి సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారని తెలుస్తుంది. ఆగష్టు 27న f3 రిలీజ్ ఫిక్స్ చేశారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మూడవ హీరో ఉంటాడని వార్తలు రాగా దర్శకుడు ఆ వార్తలను కొట్టిపడేశాడు.                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: