లవర్ తో పిచ్చిపిచ్చిగా తిరిగి చివరకి..!

NAGARJUNA NAKKA
తాప్సీపై లవర్‌ ప్రభావం చాలా గట్టిగా ఉంది. బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో లవ్‌లో పడినప్పటి నుంచి, ఆమె ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌ని స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లా మార్చేద్దాం.. కెమెరాల ముందు సిక్స్‌లు కొట్టేద్దాం అన్నట్లు బిహేవ్ చేస్తోంది. అంటే తాప్సీ త్వరలోనే ఐపీయల్‌లోకి వస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

తాప్సీ లవ్‌లో పడ్డాక చాలా మారిపోయిందట. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియస్ బోయ్‌తో రిలేషన్‌లోకి వెళ్లాక తాప్పీ కంప్లీట్‌గా చేంజ్ అయిందని చెబుతున్నారు. ఇంతకుముందు ప్రొడ్యూసర్స్‌ యాంగిల్‌లో ఆలోచించిన తాప్సీ, ఇప్పుడు ప్రేమికుడి యాంగిల్‌లో ఆలోచిస్తోందని చెబుతున్నారు. తాప్సీ సినిమా సెలక్షన్‌లో మాతియస్ బోయ్ ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు.

తాప్సీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పోర్ట్స్‌ డ్రామాల్లోనే నటిస్తోంది. ఇప్పటికే 'రష్మి రాకెట్' కోసం అథ్లెట్‌లా మారింది తాప్సీ. ఇప్పుడు క్రికెటర్‌గా నెట్‌ ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ విమెన్ క్రెకెట్ టెస్ట్, వన్డే టీమ్ కెప్టెన్, మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తోంది తాప్సీ. ఈ సినిమా కోసం క్రెకిట్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తోంది.

తాప్సీ వరుసగా స్పోర్ట్స్‌ డ్రామాస్ చేసేందుకు మాతియస్ బోయ్ కారణమంటున్నారు. ఈ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌తో తిరిగి తిరిగి తాప్సీకి కూడా స్పోర్ట్స్‌పై ఆసక్తి పెరిగిందని, అందుకే స్పోర్ట్స్‌ డ్రామాల్లో నటిస్తోందని చెప్తున్నారు. అయితే తాప్సీ ఇప్పటికే స్పోర్ట్స్‌ బిజినెస్‌లోనూ ఇన్వెస్ట్ చేసింది. ప్రీమియర్ బ్యాండ్మింటన్‌ లీగ్‌లో 'పూణే సెవన్ ఏసెస్' టీమ్‌ని కొనుగోలు చేసింది.

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ చాలా మారిపోయింది. సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా గడిపే తాప్సీకి కొత్త ఆలోచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే లవ్ లో పడిందో అప్పటి నుంచి ఆమె లక్ష్యాలు మారిపోయాయి. మంచి నటీమణి అనిపించుకోవాలని తాపత్రయ పడిన ఆమె అనుకున్నట్టుగానే అయింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇపుడేమో లవర్ బాయ్ యాంగిల్ లో ఆలోచిస్తుంటే టాక్ గట్టిగా వినిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: