ఉప్పెన సినిమా చూసి మెగాస్టార్ ఏమన్నాడో తెలుసా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా ఫ్యామిలీ  నుంచి మరో స్టార్  వెండితెరకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న  సంగతి  తెలిసిందే. ఇందులో కొత్త హీరోయిన్  కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఎలా అయినా హిట్ అవుతుందనే నమ్మకంతో వుంది చిత్ర బృందం..

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల  అవ్వాల్సింది  కానీ కరోనా కారణంగా ల్యాబ్ లోనే ఉండిపోయింది. సినిమా మీద నమ్మకంతో ఓటీటీకి ఇవ్వకుండా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూశారు నిర్మాతలు. ఎట్టకేలకు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 12న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తన మేనల్లుడి డెబ్యూ సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూడటం జరిగిందట. ఆయనకి సినిమా బాగా నచ్చిందట. దర్శకుడు బుచ్చిబాబు చాలా బాగా తీశారని..అచ్చం భారతీరాజా సినిమా లాగా  ఉందని మెగాస్టార్ కితాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతీరాజా స్టైల్ లో సినిమా ఉందని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో ఈ  సినిమా మీద అంచనాలు మరింత పెరిగి పోయాయట. మరి సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.. ఇక ఈ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.కాని మెగా ఫ్యాన్స్ మాత్రం అంచనాలు బాగా పెట్టుకున్నారు ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: