ఒక్క పంచ్ తో ఇమ్మానుయేల్ పరువు తీసేసిన రోజా.. వీడియో వైరల్..?
ఇక జబర్దస్త్ వచ్చిన తర్వాత ఎన్నో షో లు తెరమీదికి వచ్చినప్పటికీ ఏ షో కూడా జబర్దస్త్ షో ముందు నిలవలేకపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో జబర్దస్త్ లో ఏ స్కిట్ లో చూసిన కనబడుతూ తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు ఇమ్మానియేల్. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇస్తే జబర్దస్త్ వర్ష తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత ఫేమస్ అయిపోయాడు.
ఇక ప్రస్తుతం ప్రతి స్కిట్ లో కూడా ఇమ్మానియేల్ కనిపిస్తున్నాడు
అయితే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో మరోసారి ఇమ్మానియేల్ తనదైన కామెడీతో అలరించాడు అనే చెప్పాలి. ఈ ప్రోమో లో భాగంగా స్కిట్ చేస్తున్న సమయంలో ఇమ్మానియేల్ ఒక గుర్రంపై స్వారీ చేస్తూ స్టేజ్ పైకి వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే జడ్జిగా ఉన్న రోజా గాడిదతో వచ్చావ్ ఏంట్రా అంటూ ప్రశ్నిస్తోంది.. మేడం ఇది గాడిద కాదు గుర్రం అంటూ సమాధానం చెబుతాడు ఇమ్మానియేల్. నేను నిన్ను కాదు గుర్రాన్ని అడిగాను అంటూ రోజా పంచ్ వేయడంతో ఇక అందరూ నవ్వుకుంటారు.