భారీ నష్టాల పాలైన బంగారు బుల్లోడు సినిమా....

frame భారీ నష్టాల పాలైన బంగారు బుల్లోడు సినిమా....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ లో కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అల్లరి నరేష్..ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో వినోదభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాడు. ఇక రీసెంట్ గా  మన కామెడీ హీరో అల్లరి నరేష్ ఇంకా హాట్ బ్యూటీ  పూజా జవేరి హీరో హీరోయిన్లు గా ఏ.టీవీ సమర్పణలో ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’.ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిజానికి 2 ఏళ్ళ క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఈ చిత్రం జనవరి 23న విడుదలయ్యింది. ఇది వరకు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న అల్లరి నరేష్.. ఈ మధ్యకాలంలో సరైన హిట్టు అందుకోలేకపోతున్నాడు.

కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం ‘బంగారు బుల్లోడు’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.‘బంగారు బుల్లోడు’ చిత్రానికి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.9 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 కానీ వీకెండ్స్ లోనే ఈ చిత్రం కనీసం ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. ఇక వీక్ డేస్ లో రాబట్టడం అంటే కష్టమనే చెప్పాలి.దీంతో ఈ సినిమా భారీ నష్టాల పాలయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: