అరుంధతి తరువాత మరో సూపర్ హిట్

 అరుంధతి హిట్ ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్టీఆర్ కధానాయకుడిగా వినూత్నమైన కథ, కథనంతో మరో  సినిమాను ప్రారంభించడానికి సన్నాహలు చేస్తున్నారు. గతంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ఎంఎస్ రెడ్డి నిర్మించిన బాల రామాయణం సినిమాలో హీరోగా బాల్యంలోనే తెరంగేట్రం చేశారు జూనియర్ ఎన్టీఆర్.  హీరో అయిన తరువాత డేట్స్ ఇవ్వమని అడిగితే ఇస్తా అని ఎన్టీఆర్ తన చూట్టూ తిప్పించుకున్నట్లు తన ఆత్మ కధలో వ్రాసుకున్నారు మల్లేమాల. ఆయన కొడుకైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్టీఆర్ తో సినిమా చేయపోతున్నారు. అయితే ఎన్టీఆర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఒక కండిషన్ పెట్టారంట.  ఎళ్ల తరబడి సినిమా తీసే అలవాటు ఉన్న శ్యామ్ కి 40 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేయాలని ఎన్టీఆర్ షరతు పెట్టాడంట. బాదుషా తరువాత ఈ చిత్రం సెట్ మీదకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్యామ్ స్ర్కిప్ట్ పని లో బిజిగా ఉన్నారు.  ఎప్పుడు శ్యామ్ నిర్మించే సినిమాకు కోడి రామకృష్ణ దర్శకుడుగా ఉంటారు. కాని ఈ చిత్రానికి మాత్రం దర్శకుడు ఏవరు అన్నది కొన్ని రోజులు అగవలసిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: