బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

సిద్దార్ద్, జెనీలియా కాంబినేషన్‌లో వచ్చిన బాయ్స్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ సమయంలో శంకర్ సినిమాల్లో నటించడానికి హారోయిన్లు ఎదురుచూసేవారు. శంకర్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్ వచ్చినా చేసేయడానికి సిద్దంగా ఉండేవారు. కారణం.. డైరెక్టర్ శంకర్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి. కానీ.. శంకర్ సినిమాలో చాన్స్ వచ్చినా ప్రస్తుతం స్ఠార్ యాక్ట్రెస్‌గా కొనసాగుతున్న ఓ నటి ఆ సినిమాకు నో చెప్పారట. ఆమె మరెవరో కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఆమె కూడా స్టార్ స్టేటస్‌కు చేరుకున్నారు.
తెలుగులోనూ ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాలో జయమ్మ క్యారెక్టర్‌లో వరలక్ష్మీ శరత్ కమార్ నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరలక్ష్మీకి వరుస పెట్టి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయట. తాజాగా అనేక చానళ్లకు ఆమె ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ శంకర్ బాయ్స్ సినిమాలో హీరోయిన్‌గా తననే తీసుకోవాలని అనుకున్నట్టు వరలక్ష్మీ చెప్పారు.
అయితే ఆ సమయంలో తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడంతో అప్పుడే సినిమాల్లోకి వద్దని తన తండ్రి శరత్ కుమార్ చెప్పారట. దీంతో ఆమె కూడా తండ్రి మాటకు నో చెప్పకూడదని.. డైరెక్టర్ శంకర్ ఆఫర్‌కు నో చెప్పారట. లేకుంటే తాను ఆ వయసులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉండేదని తెలిపింది. చదువు మొత్తం పూర్తి చేసుకున్నాకే ఇండస్ట్రీలోకి రావాలని తల్లి దండ్రులు చెప్పడంతో.. చదువు పూర్తైన తరువాతే తాను సినిమా రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. ఒకవేళ వరలక్ష్మీ బాయ్స్ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఉంటే ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ అయి ఉండేవారేమో. కానీ.. ఒక హీరోయిన్ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్న క్యారెక్టర్లను ఆమె ఇప్పుడు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: