ఢీలో కనిపించిన దుర్గారావు.. ఈసారి స్టైల్ మార్చేశాడు..!
టిక్ టాక్ లో ఫేమస్ అయిన వారిలో దుర్గారావు కూడా ఒకడు. పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు సాంగ్ సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో తెలియదు కాని టిక్ టాక్ దుర్గారావుకి మాత్రం చాలా ప్లస్ అయ్యింది. ఆ సాంగ్ తో వెరైటీ డ్యాన్స్ చేసిన టిక్ టాక్ దుర్గారావు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక టిక్ టాక్ పాపులారిటీతో జబర్దస్త్ లో, అదిరింది షోలలో కూడా కనిపించాడు.
ఢీ డ్యాన్స్ మాస్టర్ పండు టిక్ టాక్ దుర్గారావుని ఇమిటేట్ చేయడంతో అతను ఇంకాస్త ఫేమస్ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా దుర్గారావు ఢీ 13 వేదిక మీద కనిపించాడు. ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో దుర్గారావుని కొత్త స్టైల్ లో దించారు. దుర్గారావు సిగ్నేచర్ స్టెప్ మైక్ స్టెప్ కు బదులుపుగా ఇప్పుడు స్టైల్ మార్చేశా అని వెనక చేతులు పెట్టుకుని చేశాడు. ఢీ షోలో దుర్గారావుని చూడగానే అతని ఫాలోవర్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూస్తుంటే దుర్గారావుకి ఇలానే మరిన్ని ఛాన్సులు వచ్చేలా ఉన్నాయి.
ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న దుర్గారావు ఫుల్ టైం కమెడియన్ గానో.. ఆర్టిస్ట్ గానో బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు. తప్పకుండా టిక్ టాక్ వల్లే దుర్గారావుకి ఈ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. తను చేసేది పర్ఫెక్ట్ గా రాకున్నా చేయాలన్న తపనతో.. ప్రేక్షకులను మెప్పించాలన్న కసితో చేశాడు కాబట్టే టిక్ టాక్ దుర్గారావు అంత ఫేమస్ అయ్యాడని తెలుస్తుంది.