అమ్మడి టాలెంట్ గుర్తించాల్సిందే..!

shami
ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడలాంటే కేవలం అభినయం మాత్రమే సరిపోతుందా కొద్దిగా గ్లామర్ సైడ్ కూడా ఉండాల్సిందే. అందం, అభినయం రెండిటితో పాటు లక్ కూడా తోడవ్వాల్సి ఉంటుంది. అలా లక్ కూడా యాడ్ అయితే ఒక్క సినిమాకే స్టార్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ లో తాను ఒకటని ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతుంది చిలసౌ ఫేం రుహాని శర్మ. చిలసౌ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ సినిమా చూసిన ఎవరైనా రుహానిని ఇష్టపడతారు.
చిలసౌ తర్వాత నాని నిర్మించిన హిట్ సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా కూడా హిట్ అవడంతో రుహానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యనే వచ్చిన డర్టీ హరిలో అమ్మడు నటించింది. నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో కూడా రుహాని చేస్తుంది. సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది రుహాని శర్మ. సిల్వర్ స్క్రీన్ పై అభినయంతో అలరిస్తూ ఫోటో షూట్ లో స్పెషల్ గా గ్లామర్ యాంగిల్ బయట పెడుతుంది.
రుహానిలో ఈ టాలెంట్ చూసి ఆమె ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అనే ఆలోచన వస్తుంది. దర్శక నిర్మాతలు ఆమెను ఇలా కూడా వాడుకుంటే మాత్రం రుహాని కచ్చితంగా కొన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండే ఛాన్స్ ఉంది. మరి అమ్మడి టాలెంట్ దర్శక నిర్మాతలు గుర్తిస్తారో లేదో చూడాలి. సినిమాలతో పాటు ఫోటో షూట్ లు చేస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటుంది రుహాని శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: