అయ్యప్పనుం కొషియం నుండి ఆసక్తికర అప్డేట్స్
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అధికభాగం కేరళలోని పొల్లాచ్చిలో అలాగే తమిళనాడు అడవుల్లో జరిగేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఈ షూటింగ్ కోసం వచ్చే నెల మొదట్లో యూనిట్ అంతా కేరళ వెళ్లే అవకాశం ఉంది. అంతే కాక మేకర్స్ ఈ సినిమాని రెండు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ ఇప్పటికే రైట్స్ కి భారీగా ఖర్చు పెట్టారు కాబట్టి కాస్త తక్కువ బడ్జెట్ లోనే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సినిమా కథ ప్రకారం అయితే పెద్దగా బడ్జెట్ పడాల్సిన పని కూడా లేదు. కేవలం ఒక పోలీస్ స్టేషన్ సెటప్ అలాగే ఒక లాడ్జ్ సెటప్ ఉంటే ఈ సినిమా పూర్తి అయి పోతుంది. ఇప్పటికే లాడ్జి కోసం సెట్ వేసారు అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక అంతే కాక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ కంటే తెలుగు వర్షన్ లో నిడివి తక్కువ ఉండేలా గా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఒరిజినల్ వెర్షన్ దాదాపుగా మూడు గంటల పాటు ఉంటుంది దానిని చాలావరకు తగ్గించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.