ఎఫ్ 3 డిజిటల్ రైట్స్ డీల్ మాములుగా లేదుగా...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..2019లో  సంక్రాంతికి ఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ అందించిన కామెడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలను అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పెట్టిన పెట్టుబడికి నిర్మాత దిల్ రాజుకు ఎక్కువ లాభాలు  అందించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్ 3"ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా  షూటింగ్ మొదలైన ముందు రోజు నుంచే డిజిటల్ రైట్స్ పై సూపర్  ఆఫర్లు వాస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ అయితే పెద్ద ఆఫర్ ఇచ్చిందట. "ఎఫ్ 3" డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 25కోట్లకు పైగా ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. ఇటీవల పూజా కార్యక్రమాలతో చాలా సింపుల్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోలేదు.కానీ అప్పుడే రికార్డు రేంజిలో లాభాలను అందిస్తుండడం ఈ సినిమా రేంజ్ ఏంటో అర్ధమవుతుంది.

 ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇక చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: