మెగా ఫ్యాన్స్ ని ఊర్రూతలూగిస్తున్న ఉప్పెన టీజర్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో  మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ  సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. అందుకోసం ఒక టీజర్ ని కూడా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేశారు. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్ధమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది.. కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది అంటూ హీరో మాటతో ఈ టీజర్ మొదలవుతుంది. హీరో హీరోయిన్ కి ఉన్న ప్రేమని చాలా అందమైన సీన్స్ లో చూపిస్తూ చాలా ఉత్సాహంగా టీజర్ లో చూపించారు.
ఇక ఈ టీజర్ లో గమనించినట్లయితే హీరోయిన్ బీచ్ లో లవ్ యు ఐ అని రాస్తే, ఐ లవ్ యూ అని కదా రాయాలి అని హీరో అమాయకంగా అడుగుతాడు.., మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని చెప్పి అలా రాశానని హీరోయిన్ అనడం. ఇవన్నీ కూడా గాడమైన  ప్రేమని తెలిపేలా ఉన్నాయి. అంతేకాదు, టీజర్ చివర్లో  ఈ ఒక్కరాత్రే 80 సంవత్సరాల వరకూ గుర్తుండిపోయేలా బతికేద్దాం అంటూ హీరోయిన్ చెప్తోంది. ఆ తర్వాత హీరో బీచ్ లో గాయలతో పడిపోయి ఉంటాడు. దీన్ని బట్టీ చూస్తే వీళ్ల ప్రేమకి విలన్ గా విజయ్ సేతుపతి హీరోని చంపిచేస్తాడా అన్నట్లుగా టీజర్ లో కనిపిస్తుంది.ఇక ఈ టీజర్ చూసినవాళ్లంతా కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని, చాలాకాలం తర్వాత చక్కటి తెలుగు లవ్ స్టోరీ వస్తోందని, హీరో వైష్ణవ్ చాలా నేచరల్ గా యాక్ట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ కృతి శెట్టి కి అయితే కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అయితే ఆనందంతో ఉర్రూతలూగిపోతున్నారు.ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: