హీరో పోలీస్.. హీరోయిన్ గా శృతి హాసన్ ఉండాల్సిందే..!

shami
టాలీవుడ్ లో కొన్ని వెరైటా సెంటిమెంట్స్ సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. చెప్పుకునేందుకు చాలానే ఉంటాయి కాని అందులో ఒకటి హీరో పోలీస్ సెంటిమెంట్.. హీరో పవర్ ఫుల్ పోలీస్ అయితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. హీరో పోలీస్ అయ్యి విలన్ల బరతం పడుతుంటే అబ్బో మాములుగా ఉండదు. అయితే పోలీస్ హీరోకి క్రేజీ హీరోయిన్ కావాలి ఈ విషయంలో తెలుగు దర్శకుల ఆప్షన్ ఒకరే అవుతున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ శృతి హాసన్. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న శృతి హాసన్ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరో పోలీస్ అయితే హీరోయిన్ గా శృతి హాసన్ ఉండాల్సిందే. అదెలా అంటే కెరియర్ లో హిట్లు లేక సతమతమవుతున్న శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. అయితే ఖుషి తర్వాత పదేళ్ల వరకు హిట్ అందుకోని పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టారు. పవన్ పోలీస్ గా శృతి హాసన్ హీరోయిన్ గా ఆ సినిమా హిట్. ఆ తర్వాత సూర్య సింగం 3లో కూడా సూర్య పవర్ ఫుల్ పోలీస్ గా నటించగా అది కూడా హిట్ అయ్యింది. ఇక రవితేజ క్రాక్ సినిమాలో కూడా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది.

హీరో పోలీస్ గా చేసి.. హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి. ఇదే సెంటిమెంట్ గా మారితే మాత్రం పోలీస్ కథ రాసుకుంటే అందులో హీరో ఎవరైనా గాని హీరోయిన్ గా మాత్రం శృతి హాసన్ ను ఫిక్స్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు. కెరియర్ లో ఆమధ్య వెనక్కి తగ్గినట్టు అనిపించిన శృతి హాసన్ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. క్రాక్ హిట్ ఆమె కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: