భారీ బడ్జెట్ తో సీక్వెల్ సినిమాలు..!

NAGARJUNA NAKKA
2020 కరోనా నామ సంవత్సరంగా మారిపోతే, 2021 సీక్వెల్స్‌ నామ సంవత్సరంగా మారిపోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్‌ వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో లార్జ్‌ స్కేల్‌లో తెరకెక్కుతున్నాయి సీక్వెల్‌ సినిమాలు.

మొన్నటివరకు తెలుగు హరోలు సీక్వెల్స్‌కి పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోల నుంచి మొదలుపెడితే యంగ్‌స్టర్స్‌ వరకు అందరూ సీక్వెల్స్‌కి సైన్ చేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరూ కలిసి ఫన్‌రైడ్‌ 'ఎఫ్-2'ని మరో లెవల్‌కి తీసుకెళ్తున్నారు. 'ఎఫ్-2'కి సీక్వెల్‌గా వస్తోంది 'ఎఫ్‌-3'. దిల్‌రాజు బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి డైరెక్ట్‌ చేస్తోన్న ఈ సీక్వెల్‌ ఫస్ట్‌ పార్ట్‌ కంటే హై బడ్జెట్‌తో వస్తోందని సమాచారం.

శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్ హిట్ 'ఢీ'. స్టార్‌ స్టేటస్‌ తీసుకొచ్చిన ఈ కథకే ఇప్పుడు సీక్వెల్‌ రెడీ చేస్తున్నాడు శ్రీను వైట్ల. 'డీ అండ్ డీ-డబుల్‌ డోస్' టైటిల్‌తో తెరకెక్కుతోందీ సినిమా. ఇక వైట్ల ఈ సీక్వెల్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

చందు మొండేటికి స్పెషల్‌ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా 'కార్తికేయ'. ఆనిమల్ హిప్నాటిజం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈసినిమా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. నిఖిల్‌కి సూపర్‌ హిట్‌ ఇచ్చింది. ఇప్పుడీ కథకే సీక్వెల్‌ రెడీ చేస్తున్నాడు చందు మొండేటి. పోయినేడాదే మొదలైన ఈ సినిమా 2021లోనే రిలీజ్ అవుతుందని టాక్.

అడివి శేష్ 'గూఢచారి' సినిమాకి కూడా సీక్వెల్‌ రెడీ అవుతోంది. 'మేజర్' నుంచి ఫ్రీ అవ్వగానే అడివి శేష్ 'గూఢచారి2' మొదలుపెడతాడని సమాచారం. అలాగే నాని నిర్మాణంలో విశ్వక్‌సేన్‌ లీడ్‌ రోల్ ప్లే చేసిన 'హిట్' సినిమాకి కూడా సీక్వెల్ వస్తోంది. అయితే ఈ సీక్వెల్‌ విశ్వక్‌సేన్‌ని అడివి శేష్ రీప్లేస్ చేస్తున్నాడు.

తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ సీక్వెల్‌ సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు అందుకున్న కథలు ఇప్పుడు సీక్వెల్స్‌తో జనాలముందుకొస్తున్నాయి. నాటి హిట్స్‌ని రిపీట్‌ చేసేందుకు భారీ బడ్జెట్‌తో బరిలో దిగుతున్నాయి నేటి సీక్వెల్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: