టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!
గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో కెక్కారు సచిన్. తాము చేస్తున్న వ్యాపారంలో బకాయిలు సరిగా చెల్లించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతని స్నేహితుడు పరాగ్ సంఘ్వి. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారు సచిన్ జోషి, అతడి ఫ్రెండ్ పరాగ్ మరియు కొందరు వ్యాపార వేత్తలు. ఇది ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో వీరు ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం... ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ.58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉండగా... సచిన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాడు అని...2016 నుండి ఎటువంటి చెల్లింపులు చేయలేదని ఆరోపించారు.
అయితే దీనికోసం సంఘ్వి పుణె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ విషయంపై సచిన్ జోషి పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఈ అంశంపై పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు సచిన్ జోషి పై 30 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జోషి ఫ్రెండ్ ఫిర్యాదుతో చేపట్టిన దర్యాప్తులో కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.