అయాన్ అర్హ ల మధ్య వ్యత్యాసం పై బన్ని కామెంట్స్ !

Seetha Sailaja
అల్లు అర్జున్ పిల్లలు అయాన్ అర్హ లకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు అవకాశం కుదిరినప్పుడల్లా బన్నీ తన పిల్లలకు వివిధ సందర్భాలలో ఆ సందర్భాన్ని బట్టి వెరైటీ డ్రస్ లు వేసి తాను ఆనందించడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటంతో వీరిద్దరూ ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయారు.

దీనికితోడు ఈమధ్య అర్హ అంజలి పాప లా నటిస్తూ చేసిన వీడియో కూడ వైరల్ అయింది. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరూ కాబోయే ఫ్యూచర్ స్టార్స్ అంటూ అప్పుడే ప్రచారం మొదలైపోయింది. ఈ విషయాలు బన్నీ దృష్టి వరకు రావడంతో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన క్లారిటీ ఇచ్చాడు.

తన కొడుకు అయాన్ కు ఫోటోలకు పోజులు ఇవ్వడం అంటే ఇష్టం లేదని అయితే కూతురు అర్హ మాత్రం కెమెరాలను చూస్తే చాలు పోజులు ఇస్తూ తాను ఫోటోలకు రెడీ అని సంకేతాలు ఇస్తుందని బన్నీ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతానికి బన్నీ మాటలు బట్టి చూస్తే స్టార్ గా ఎంట్రీ ఇచ్చే లక్షణాలు అయాన్ కంటే అర్హ కే ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది.

ఇదే సందర్భంలో తన భార్య స్నేహ రెడ్డి గురించి మాట్లాడుతూ బన్నీ కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. మొదటిగా తాను తన భార్యను ఒక పబ్బులో చూశానని ఆ పబ్బులో అంతమంది మధ్య కూడ ఆమె చాలా డిగ్నిటీగా కనిపించిందని అప్పుడు సమయం రాత్రి రెండు గంటలవుతున్నా చాలా పద్ధతిగా కనిపించడం తనకు బాగా నచ్చిందని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ తన భార్య స్నేహా రెడ్డి వ్యక్తిత్వం పై కామెంట్ చేసాడు. దీనినిబట్టి చూస్తుంటే అల్లు అర్జున్ స్నేహల మధ్య ప్రేమ చిగురించడానికి వారదిగా ఆ పబ్బు మారింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: