ఆ కోరికను శ్రీదేవి కూతురు తీరుస్తుందా..!
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఎప్పుడూ లార్జ్‌స్కేల్‌లోనే ఆలోచిస్తుంటాడు. మార్కెట్ లెక్కలు, కలెక్షన్ల వాల్యూతో సంబంధం లేకుండా భారీ సినిమాలే చేస్తుంటాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు, వాటిల్లో టాప్ హీరోయిన్లతో స్టెప్పులు, క్రేజీ హీరోయిన్స్‌తో ఐటెమ్ సాంగ్స్ పెడుతుంటాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఈ ఫార్ములానే ప్రయోగిస్తున్నాడట 'అల్లుడు శీను'.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. వి.వి.వినాయక్ ఈ రీమేక్‌ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లాంచింగ్ మూవీ ఒక రేంజ్‌లో ఉండాలని, ఫస్ట్ మూవీతోనే నార్త్ అటెన్షన్‌ని గ్రాబ్ చెయ్యాలనుకుంటున్నాడట బెల్లంకొండ. అందుకే ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట.
జాన్వీ కపూర్‌ని సౌత్‌కి తీసుకురావాలని చాలామంది డైరెక్టర్లు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు బెల్లంకొండే సౌత్ నుంచి నార్త్‌కి వెళ్తున్నాడు కాబట్టి, జాన్వీని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడట. కాంటాక్ట్స్‌ని ఉపయోగించి జాన్వీతో రొమాన్స్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడట బెల్లంకొండ శీను. మరి ఈ హీరో ట్రైల్స్‌కి జాన్వీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మొత్తానికి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ శ్రీదేవి కూతురిని తెగ ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా ఆమెను ఒప్పించాలని చేయని ప్రయత్నమంటూ లేదు. ఛత్రపతి రీమేక్ కోసం జాన్వీ కపూర్ తో సంప్రదింపులు జరపడం ఇపుడు హాట్ టాపిక్ మారింది.ఎలాగైనా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టాలని బెల్లకొండ సాయి శ్రీనివాస్ తెగ ఉబలాటంగా ఉంది. జాన్వీ కపూర్ ను ఆ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఒప్పిస్తే చాలు.. బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టచ్చనే ఆలోచనలో ఉన్నాడు.