క్రాక్‌కు ఇంత పూర్ బ‌జా... నెగిటివ్ ప్ర‌చారం వెన‌క‌...?

VUYYURU SUBHASH
మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న క్రాక్ సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. వ‌రుస ప్లాపుల‌తో పాటు చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు బ‌లుపు లాంటి హిట్ ఇచ్చిన మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం, శృతీ హాస‌న్ హీరోయిన్ కావడంతో పాటు థ‌మ‌న్ ఊర‌మాస్ బిట్స్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచాయ‌న్న‌ది వాస్త‌వం. పైగా ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌డంతో సినిమా ఎలా ? ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంది.

ర‌వితేజ నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించిన డిజాస్ట‌ర్లు ఒక‌టి అయ్యాయి. ఇక సంక్రాంతికి మ‌రో రెండు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండ‌డంతో ఐదారు రోజుల ముందుగానే ఈ నెల 9నే క్రాక్‌ను థియేట‌ర్ల‌లోకి తెస్తున్నారు. ఎన్ని అంచ‌నాలు ఉన్నా క్రాక్‌కు మాత్రం పూర్ బ‌జ్ క‌నిపిస్తోంది. పైగా క్రాక్ అంత‌గా గొప్ప‌గా లేద‌ని సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ జ‌ర‌గ‌కుండా కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు ప‌ర‌మ రొటీన్ రివేంజ్ డ్రామా అని ప్ర‌చారం చేశారు.

ఇక ఈ ఇంఫార్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ మీద కూడా ప‌డిందంటున్నారు. అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా జ‌ర‌గ‌లేద‌ని.. చాలా చోట్ల అడ్వాన్స్‌లు కూడా రాలేద‌ని స‌మాచారం. ఇక కొంద‌రు సినీ విమ‌ర్శ‌కులు కూడా త‌మ సోష‌ల్ మీడియాలో క్రాక్‌కు అనుకున్న రేంజ్‌లో ప్రి రిలీజ్ బ‌జ్ లేద‌ని. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా చాలా పూర్‌గా ఉన్నాయ‌ని పోస్ట్ చేశాడు. ఇక ఈ ప్ర‌చార‌మే ఇలా ఉంటే.. అస‌లు ఓపెనింగ్స్ అయినా అనుకున్న‌ట్టుగా వ‌స్తాయా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే సినిమా వర్గాలు మాత్రం సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా ఉన్న సినిమా వాళ్లు ఈ నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నారా ? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: