పవర్ స్టార్ తో సినిమా తన డ్రీమ్ అంటున్న డైరెక్టర్..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ అంటే ఇక కెరియర్ పీక్స్ కు చేరినట్టే. డైరక్టర్ కొత్త పాతా అన్నది కాదు పవర్ స్టార్ తో సినిమానే లక్ష్యం గా కొందరు ఇండస్ట్రీకి వస్తారు. ఇక లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో తను కూడా ఉన్నాడని చెప్పుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. కందిరీగ, రభస, హైపర్ సినిమాలు డైరెక్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ ప్రాస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకోగా త్వరలోనే సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంతోష్ శ్రీనివాస్ ఎప్పటికైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.

ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రభస సినిమా చేసిన సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమాతోనే స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరుతాడని అనుకోగా రొటీన్ స్టోరీతో ఆ సినిమాతో నిరాశపరచాడు. ఇక ఫైనల్ గా మరోసారి అల్లుడు అదుర్స్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్. బెల్లకొండ శ్రీనివాస్ కూడా రాక్షసుడు సినిమాతో హిట్ అందుకోగా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు డైరక్టర్ శ్రీనివాస్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: