అప్పట్లో అత్యంత భారీ పారితోషికాన్ని అందుకున్న హీరో ఎవరో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే?
సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు బాలనటులుగా అడుగుపెట్టి, కొన్ని చిత్రాలలో నటించి ఆ తరువాత గ్రాడ్యుయేషన్ అంటూ వెళ్లిపోతుంటారు.ఆ తరువాత తిరిగి వచ్చి స్టార్ హీరోలు అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.అయితే వీరు సినిమాల్లో నటించేటప్పుడు వీరి రెమ్యునరేషన్ కూడా అంతే స్థాయిలో నిర్ణయించబడుతుంది.బాలనటుడిగా చాలామంది పెద్ద ఎత్తున భారీ రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అలా బాలనటుడిగా నటించినప్పుడు అందరికన్నా ఎక్కువగా భారీ పారితోషికాన్ని పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
పూర్తి వివరాల్లోకి వెళితే సాధారణంగా ప్రతి హీరో హీరోయిన్లు తమ గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేసుకొని, తిరిగిvఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అప్పుడు వారి వయసు దాదాపుగా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఉంటుంది. కానీ కొంతమందికి చదువు అబ్బక పోవడంతో చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ తోపాటు అల్లు అర్జున్ కూడా చదువు అబ్బక తక్కువ వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వీరందరి కన్నా ముందే 17 సంవత్సరాలకే జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేశారు.
1997లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం సినిమాకు నటుడిగా నటించి,అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.అంతేకాకుండా ఈ చిత్రానికి అవార్డు కూడా లభించింది.వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన నిన్ను చూడాలని మూవీ ద్వారా రామోజీరావు ఎన్టీఆర్ ను పరిచయం చేశాడు.అలా 17 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలోకి హీరో గా అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచినప్పటికీ,అచ్చం తాత లాగే నటిస్తున్నాడని ప్రేక్షకులు అభినందనలు పొందాడు.ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్,ఆది,సింహాద్రి సినిమాల్లో నటించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలలో హీరోగా నటించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం మరోసారి అదే డైరెక్టర్ తోఆర్. ఆర్.ఆర్ మూవీ కూడా చేస్తున్నాడు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఆయన తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్.2001లో వచ్చిన నిన్ను చూడాలని మూవీకి సోలో నటుడిగా నటించినప్పుడు ఈయనకు రెమ్యూనరేషన్గా రూ.4 లక్షల రూపాయలు ఇచ్చారు. అంత చిన్న వయసులోనే అంత డబ్బు చూసి, ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ శాలినికి ఇచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రెండేళ్లలోనే భారీ విజయాలను సాధించి స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.