'కెజిఎఫ్ - 2' టీజర్ అప్ డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ .... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ....??

GVK Writings
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో కన్నడలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా ఒకటి అని చెప్పక తప్పదు. దాదాపు రెండేళ్ల క్రితం యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కి  ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా కన్నడ సహా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ అయి అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ మూవీకి ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా తెచ్చిపెట్టింది.

ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. మొదటి భాగాన్ని మించే విధంగా మరింత భారీ ఖర్చు అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలింస్ వారు ఈ మూవీ కోసం ఎంతో భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కథా కథనాల పరంగా యాక్షన్ అంశాలతో పాటు అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయి ఫైట్స్ వండర్ ఫుల్ డైలాగ్స్ కలబోతగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్ నేడు టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఈ నెల 8వ తేదీన హీరో యాష్ పుట్టినరోజు సందర్భంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ టీజర్ ని ఎంతో అట్టహాసంగా యూట్యూబ్లోకి చేయబోతున్నట్లు మూవీ ఒక ప్రకటనలో భాగంగా తెలిపింది. ఇక ఈ మూవీ టీజర్ కోసం ఎప్పటి నుంచొ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక్కసారిగా ఈ న్యూస్ అమిత ఆనందాన్నిచ్చిందని చెప్పకతప్పదు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ టీజర్ ని పలు భాషల్లోని పలువురు టాప్ స్టార్స్ రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. దాదాపుగా మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వేసవి కానుకగా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: