రిపబ్లిక్ డే పై కన్నెసిన రాజమౌళి !
ఇది ఇలా ఉండగా ఎవరు ఊహించని విధంగా రాజమౌళి ఈసినిమాకు సంబంధించి న్యూయియర్ సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ నామ సంవత్సరం అంటూ ఒక పోష్టర్ ను విడుదల చేసి ఈమూవీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది అన్న సంకేతాలు ఇచ్చాడు. ఇది చాలదు అన్నట్లుగా రిపబ్లిక్ డే సందర్బంగా ఒక మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయించి విడుదలచేయాలి అన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈసారి ఈపోస్టర్ లో చరణ్ జూనియర్ లుక్స్ ఒకే పోస్టర్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో రాజమౌళి ఉన్నట్లు టాక్. ఈ మోషన్ పోస్టర్ విడుదల తరువాత ఈమూవీ బిజినెస్ గురించి కూడ ఆలోచనలు చేయాలని జక్కన్న వ్యూహం అని అంటున్నారు. అంతేకాదు రిపబ్లిక్ డే నాడు విడుదలకాబోతున్న ఈమూవీ పోస్టర్ లో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించకపోయినా అది విడుదల అవ్వబోతున్న నెలను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకసారి ఈమూవీ విడుదలయ్యే నెలను ప్రకటిస్తే బయ్యర్లలో కదలిక వచ్చి ఈసినిమాకు భారీ ఆఫర్స్ వస్తాయని రాజమౌళి ఆలోచన అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ ను మార్చిలో ఎట్టి పరిస్థితులలోను పూర్తిచేయాలని రాజమౌళి గట్టి పట్టుదల పై ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. మార్చి అనుకుంటే వారం పదిరోజులు అటు ఇటుగా షూటింగ్ ఏప్రిల్ లోనే ముగించే అవకాశం ఉంది అని రాజమౌళి ఆలోచన. ఈసినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ దేశ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీ పై రోజురోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి..