రవితేజ క్రాక్ మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయిందోచ్...!

VAMSI
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం  క్రాక్. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ సరసన ఆడిపాడనుంది. రవితేజ హీరోగా, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ హ్యాట్రిక్  చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. డాన్‌ శీను, బలుపు వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మరో చిత్రం ‘క్రాక్‌' . సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ సమర్పణలో బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. రవితేజ సినీ జీవితంలో రానున్న అరవై ఆరవ చిత్రం క్రాక్. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మరో విక్రమార్కుడిలా.... ఈ సినిమాలో రవితేజ అదరగొడతాడని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. జనవరి 1న మూవీ ట్రైలర్ ను దర్శక నిర్మాతలు గోపీచంద్, మధు విడుదల చేయబోతున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు యమ ఫాస్ట్ గా సాగుతున్నాయి. మంగళవారం ఈ సినిమా డబ్బింగ్ పనులను రవితేజ  మొదలుపెట్టారు. ఈ చిత్రంతో ఎలాగైనా సాలిడ్ హిట్ ను తన అకౌంట్లో వేసుకోవాలని కసిగా ఉన్నాడు హీరో రవితేజ. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అటు చిత్ర బృందం కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తోంది.  సంక్రాంతి పండుగ బహుమతిగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి... ప్రేక్షకులు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: