అఖిల్ అజ్ఞాతవాసం పై సమాధానం లేని ప్రశ్నలు !
‘బిగ్ బాస్’ షో కొనసాగుతున్నంత సేపు అఖిల్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొనాల్ తో అతడు నడిపిన లవ్ ట్రాక్ వల్ల కావచ్చు టాస్క్ ల విషయంలో అతడు చూపించిన వేగంతో కావచ్చు బుల్లితెర ప్రేక్షకులలో అఖిల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. దీనితో అతడికి అభిమానులు పెరిగిపోయి అతడికి ఓట్లు కూడ బాగా రావడంతో అతడు అందరు ఊహించినట్లుగానే టాప్ 5 లోకి వచ్చాడు.
అయితే అఖిల్ చిట్టచివరకు విన్నర్ కాలేకపోయి రన్నర్ గా మిగిలిపోయాడు. కానీ రన్నర్ కు రావలసినంత పబ్లిసిటీ కూడ రాకుండా మొత్తం పేరు అంతా సోహెల్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నాగార్జున చిరంజీవి లు కూడ అఖిల్ ను పెద్దగా ప్రశంసించకుండా సోహెల్ పై ప్రశంసలు కురిపించారు. ఇక టాప్ 5లో ఉన్న హారిక అరియానా లతో అనేక ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి కానీ ఎక్కడా అఖిల్ జాడలేదు.
అప్పుడే సోహెల్ హీరోగా సినిమా కూడ మొదలైపోయింది. అభిజిత్ కు కూడ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎక్కడా ఎవరు అఖిల్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. దీనితో సినిమా అవకాశాలు రాలేదు కదా కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడ అఖిల్ కు రాకపోఅవడం వెనుక కారణం ఏమిటి అంటూ అనేకమంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఒకవైపు సోహెల్ త్యాగానికి ప్రతి రూపంగా ప్రశంసలు తెచ్చుకుంటూ ఉంటే అఖిల్ ను ఎవరు గుర్తించని పరిస్థితులలో అతడికి అన్యాయం జరిగింది అంటూ కొందరు అభిమానులు బాధపడుతున్నారు..