జార్జి రెడ్డి హీరో సరి కొత్త సినిమా ప్రారంభం...!

VAMSI
మరో అద్భుతమైన విభిన్న కథతో మనల్ని అలరించడానికి రాబోతున్నాడు జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్. వైవిద్య భరితమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో. తొలి చిత్రం కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో వంగ వీటి సినిమా చేసి ..విమర్శకుల ప్రశంశలు అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు సందీప్ . జార్జిరెడ్డి సినిమా లో అతని పాత్ర మ్యాజిక్ అనే చెప్పాలి... విప్లవకారుడి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తెరకెక్కిన జార్జి రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుని స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నాడు హీరో సందీప్ మాధవ్.

ఈ చిత్రంలో అతను చేసిన పాత్ర కు ప్రశంసల జల్లులు వెల్లువెత్తాయి. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు సందీప్. అయితే ఇప్పుడు తాజాగా హ్యాట్రిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సందీప్ మాధవ్. అయితే ఈ చిత్రం కూడా తన ముందు చిత్రాల లాగే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అప్సర్ హుస్సేన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. యస్ అండ్ యమ్ క్రియేషన్స్ మరియు వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై సుబాని అబ్దుల్ నిర్మించబోతున్నారు. మలయాళ కథానాయికలైన గాయత్రి సురేష్, అక్షిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

యువ సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు ప్రముఖ దర్శకుడు వీరశంకర్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న ఈ చిత్రంలో వైవిధ్యభరిత నటుడు సందీప్ మాధవ్ చేయబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దీనితో ఈ సినిమా కూడా సందీప్ కు జార్జి రెడ్డి సినిమా లాగా మంచి క్రేజును తీసుకు రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: