కోటప్పకొండలో బాలయ్య.. ఏం చేస్తున్నాడో తెలుసా..??

Anilkumar
ఈ మధ్య కాలంలో మన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన వరుస సినిమాలు అభిమానులను నిరాశపరుస్తున్నాయి..తమ అభిమాన హీరోకి ఓ హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరా అని ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో బోయపాటి శ్రీనుతో ఓ సినిమాని ప్రకటించాడు బాలయ్య.దీనితో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. ఎందుకంటే  గతంలో కూడా ఇలానే వరుస ప్లాపులతో డీలా పడ్డ మన బాలయకి సింహా రూపంలో భారీ విజయాన్ని అందించిన బోయపాటి...వెంటనే ఆ తర్వాత లెజెండ్ సినిమా రూపంలో అంతకు మించిన విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆ రెండు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బోయపాటి ఈ హ్యాట్రిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.సినిమాలో బాలయ్యని రెండు విభిన్న తరహా పాత్రల్లో చూపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం.

ఇక మరో పాత్రలో ఇటీవలే టీజర్ లో చూపించిన విధంగా రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడు మన బాలయ్య. ఇక టీజర్ కూడా భారీ రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో అభిమానులు సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా..  బోయపాటి  ఈ మూవీని తీస్తున్నాడు..ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను పలనాడులోని కోటప్ప కొండ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక సెట్ కూడా వేయడం ఈ రోజు నుండి మొదలుపెట్టారు.

ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను తీయడానికి బోయపాటి ప్లాన్ చేశాడు. అన్నట్టు బోయపాటిది ఈ ప్రాంతమే.నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నా.. కుదరలేదు. అందుకే కోటప్ప కొండ మీద షూట్ ను పెట్టుకున్నారు. మొన్నటివరకూ ఈ సీక్వెన్స్ ను యాదగిరిగుట్టలో ప్లాన్ చేశారు.కాకపోతే అక్కడ కంటే పలనాడు ప్రాంతం అయితేనే నేటివిటీకి దగ్గరగా ఉంటుందని మేకర్స్ ఫీల్ అయ్యారట. అయితే సినిమా బిగినింగ్ ఎపిసోడ్ కి ఒక టెంపుల్ కావాలట. అందుకే ఆ సీక్వెన్స్ కోసం యాదగిరిగుట్టలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని తీసుకున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్...!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: