అసలు మెగా, మంచు ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతోంది..ఎప్పుడూ లేనిది ఈ హీరోలు ఎందుకు ఇలా సడెన్ గా కలుసుకుంటున్నారు..??

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా, మంచు ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, కలక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య మంచి స్నేహం ఉంది..మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాల్లో మోహన్ బాబు విలన్ పాత్రల్లో మెప్పించాడు.. వీరిద్దరూ కలిసి సినిమాల్లో పనిచేసిన రోజుల్లోనే వీరి స్నేహం మొదలైంది.. అయితే ఇప్పటికీ కూడా వీరిద్దరూ ఆ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.. చెప్పాలంటే ఒక్కోసారి ఇద్దరి మధ్యా మాటల తూటాలూ పేలతాయి. సరదా మాటలు నవ్వులు పూయిస్తాయి. ఒక దశలో మెగా ఫ్యామిలీపై కోపంతో రామ్ గోపాల్ వర్మతో మోహన్ బాబు సాన్నిహిత్యం ప్రదర్శించినట్లు గతంలో వార్తలొచ్చాయి.నిజానికి చిరంజీవిని వాడు వీడు అని సంబోదించిన మోహన్ బాబు ఈ మధ్య గౌరవ సూచకంగా మాట్లాడుతూ వస్తున్నారు.

 లోపల ఎలా ఉన్నా, పైకి ఆలింగనం చేసుకుని కన్పించడం కూడా అందరికీ తెలుసు. అలాంటిది, చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంటే, ఆ సెట్‌కు మోహన్‌బాబు స్వయంగా వెళ్లి చిరంజీవిని స్నేహపూర్వకంగా కలిశారు.చిరకాల మిత్రుడు తన సెట్‌కు రావడంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడుకొన్నారు. అంతకు ముందే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరుని కల్సి, ఎందుకు కలిసానో తర్వాత చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టాడు. ప్రస్తుతం 'సన్‌ ఆఫ్‌ ఇండియా' చిత్రంలో నటిస్తున్న మోహన్‌బాబు ఇంతకీ చిరుని ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారో మాత్రం బయటకు రాలేదు.

అయితే ఇప్పుడు ఇండ్రస్టీలో మెగా, మంచు ఫ్యామిలీస్ మధ్య అసలు ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది.. ఎప్పుడూ లేనిది ఇంత సడెన్ గా ఈ హీరోలు కలుసుకోవడంపై ఇండ్రస్టీలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మరి వీళ్ళు ఇలా కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఇండ్రస్టీలోని పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.ఇక ప్రస్తుతం  ఆచార్య షూటింగ్ తో బిజీగా ఉన్న చిరూ.. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: