గోపీచంద్ తో "పక్కా కమర్షియల్" సినిమా తెరకెక్కిస్తున్న మారుతి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చిన్న సినిమాలు చేసుకుంటూ మంచి హిట్స్ సాధించి ఎదిగాడు మారుతీ. తరువాత నానితో "భలే భలే మాగాడివోయ్"సినిమాతో మంచి హిట్ అందుకొని టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో సరికొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాడు ఈ డైరెక్టర్. ముఖ్యంగా సినిమా టైటిల్స్ కి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరో ఇంటరెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నాడు. ‘ప్రతిరోజు పండగే’ సినిమా తరువాత మారుతి నుండి మరో సినిమా రాలేదు.ప్రస్తుతం హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు మారుతి.

 యూవీ, గీతా ఆర్ట్స్ కలిసి  ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సినిమాలో గోపి చంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఫీజు కోసం ఎలాంటి కేసునైనా వాదించే క్యారెక్టర్ అది. ప్రతీ విషయంలో కమర్షియల్ గా ఆలోచించే ఆ లాయర్ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట.ఈ పాయింట్ ని బట్టి సినిమాకి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పెట్టాలని మారుతి భావిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం గోపీచంద్.. మారుతి సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సివుంది. అవి సర్దుబాటు అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి అధికార ప్రకటన వెల్లడించబోతున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: