కొత్త అవతారం ఎత్తిన అపరిచితుడు ...!?
.ముఖ్యంగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతి నటుడిగా పరిచయం కాబోతున్నాడు..ఇందులో నటుడు విక్రమ్ కనిపించనున్న గెటప్‌ల గురించి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కోబ్రా చిత్రంలో విక్రమ్ 20 గెటప్పుల్లో కనిపించనట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న కథా చిత్రం కావడంతో హీరోకు ఇన్ని గెటప్‌లు అవసరం అయ్యాయి అంటున్నారు. దీంతో కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రంలోని విక్రమ్ గెటప్‌లు ఒక్కొక్కటీ వరుసగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల ఒక గెటప్‌ను విడుదల విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. కోబ్రాలో విక్రమ్ సెకండ్ లుక్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది.
ఆ ఫొటోలో పొడవాటి.. గజిబిజి జట్టుతో కనిపించాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదుడులో ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల క్రితం సినిమా చిత్రీకరణకు ప్రభుత్వాలు అనుమతివ్వడంతో.. కోబ్రా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. తమిళనాడులోనే షూట్ చేస్తున్నారు.అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు. వీరితో పాటు కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు