ఛత్రపతి శివాజీ గెటప్లో అదరగొట్టిన బహుభాషా నటుడు మాధవన్!
ఇతను స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరి వాడయ్యాడు. తరువాత కాలంలో ప్రేమ సినిమాలను నెమ్మదిగా తగ్గించుకుంటూ పెర్ఫార్మన్స్ కి అవకాశం ఉన్న మంచి పాత్రలను మాత్రమే భాషతో సంబంధం లేకుండా చేస్తున్నాడు. ఇక ఇటీవలే తెలుగులో ఈ ఏడాది అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు మాధవన్. ఈ సినిమా ఓటీటీలో భారీ అంచనాలతో విడుదల ఐనప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. ఇంతకీ ఆ ఫొటో ఎవరిదో తెలుసా? ఛత్రపతి శివాజీ లుక్‌లో ఉన్న మాధవన్ ఫొటో. ఈ గెటప్ ఏదో సినిమా కోసం ట్రై చేసిందట. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదని సినీవర్గాలు అంటున్నాయి. కానీ మొత్తానికి ఛత్రపతి శివాజీ గెటప్‌లో మాధవన్ అదరగొట్టాడనే చెప్పాలి.. ప్రస్తుతం ‘మారా’ అనే తమిళ చిత్రంతో పాటు, రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు ఆర్ మాధవన్.