బిగ్ బాసే కావాలి.. చిరు రాక నాగ్ నిర్ణయమేనా..?

shami
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి హౌజ్ మేట్స్ ను అలరించడమే కాకుండా వారికి మంచి ఛాన్సులు కూడా ఇస్తానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కోసం కూడా చిరంజీవి గెస్ట్ గా రాగా సీజన్ 4లో కూడా ఆయన్నే పిలిచారు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవి రావాలని కోరింది నాగార్జున అని తెలుస్తుంది.

బిగ్ బాస్ నిర్వాహకులు మహేష్, ఎన్.టి.ఆర్ పేర్లని సూచించారట. దాదాపు ఇద్దరిలో ఒకరు కన్ ఫాం అని అన్నారు. కాని ఫైనల్ గా టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. అయితే చిరు ఇదే విషయాన్ని చెబుతూ ముందు ఎవరెవరినో అనుకున్నారు కాని నాగ్ తనని రమ్మని చెప్పాడు అందుకే వచ్చానని చెప్పాడు. మరి తన కన్నా చిన్నవాళ్లని గెస్ట్ గా పిలవడం ఎందుకు అనుకున్నాడా లేక వారి ముందు తను చిన్న వాడవుతానని భావించాడో కాని మహేష్, ఎన్.టి.ఆర్ లను నాగార్జున వద్దని అన్నాడట.

బిగ్ బాస్ టీం కు చిరు పేరుని సజెస్ట్ చేసింది కూడా నాగార్జుననే అని తెలుస్తుంది. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా సీజన్ 4ని పూర్తి చేశారు. కరోనా టైం లో స్టార్ట్ అయిన ఈ షో ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అని హోస్ట్ నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజీత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: