చిల్లర కామెడీ అన్న నోయల్.. కామెడీ కింగ్ అనేశాడు..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్ తన ఆటని సగంలోనే ముగించాడు. మొదట్లో తన ఆటతో అలరించిన నోయల్ ఆ తర్వాత తన కాలి నొప్పి ఇబ్బంది పెట్టడంతో కొద్దిరోజులు ఓర్చుకోగా ఫైనల్ గా హౌజ్ లో నుండి బయటకు వచ్చేశాడు. అయితే నోయల్ బయటకు వెళ్తూ స్టేజ్ మీద ఉండి అవినాష్, అమ్మ రాజశేఇఖర్ లను ఎటాక్ చేస్తూ మాట్లాడాడు. ముఖ్యంగా అవినాష్ ను చిల్లర కామెడీ అనడం.. అమ్మా రాజశేఖర్ ను కూడా అదే రేంజ్ ఎటాక్ చేయడం జరిగింది.

తనకు ఉన్న కాలు నొప్పిని తమ కామెడీకి వాడుకున్నాడని అవినాష్, అమ్మా రాజశేఖర్ మీద ఫైర్ అయ్యాడు. అప్పటివరకు అవినాష్ గ్రాఫ్ సూపర్ గా ఉండగా నోయల్ అలా ఎటాక్ చేసిన తర్వాత అతని గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత అవినాష్ ప్రతి విషయానికి సీరియస్ అవుతూ వచ్చాడు. ఇక నోయల్ మీద ఉన్న కోపంతో అమ్మ రాజశేఖర్ కూడా మిగతా హౌజ్ మేట్స్ మీద తన కోపాన్ని ప్రదర్శించారు.

అయితే ఫైనల్ ఎపిసోడ్ లో వీరి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాడు నోయల్. అవినాష్ సూపర్ ఎంటర్టైనర్ అని.. అమ్మా రాజశేఖర్ గారు తనకు ఆల్రెడీ తెలుసని.. ఆయనకు ఆల్రెడీ మంచి క్రేజ్ ఉందని.. హౌజ్ లో అప్పుడు ఉన్న్న తన బాధ వల్ల వారిద్దరి మీద తను అలా రెస్పాండ్ అయ్యానని.. బిగ్ బాస్ హౌజ్ లో గొడవని హౌజ్ లోనే వదిలి వచ్చేశానని అన్నారు నోయల్. అవినాష్ లేచి అతనికి నోయల్ కు హగ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: