8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

shami
సౌత్ లో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా సమంత వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కినేని కోడలిగా మారిన సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫామ్ కొనసాగిస్తుంది. అంతేకాదు డిజిటల్ మీడియాలో కూడా అమ్మడు దూసుకెళ్తుంది. ఆహా కోసం సమంత స్పెషల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం సమంత భారీగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

సమంత తో  సామ్ జామ్ షో ప్లాన్ చేశారు ఆహా టీం. టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూస్ చేస్తూ వారి సీక్రెట్స్ ను బయటకు లాగుతుంది సమంత. సమంత షో కాబట్టి ఆటోమెటిక్ గా ఆ షో మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే సమంత ఈ షోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అన్న దాని మీద క్లారిటీ రాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత  సామ్ జామ్ లో ఎనిమిది ఎపిసోడ్స్ కోసం కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.

హీరోయిన్ గానే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా సమంత ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో సమంత రెండు చేతులా సంపాదిస్తుంది. అయితే ఎనిమిది షోలు మాత్రమే ఎందుకు.. కేవలం 8 షోలకే  సామ్ జామ్ అంటూ ఇంత హడావిడి చేశారా అంటే.. మొదట ఎనిమిది ఎపిసోడ్స్ చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సమంత చేసిన చిట్ చాట్ ను ఆహాలో అప్లోడ్ చేస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: