వివాదాలే వాళ్లకు లైఫ్ ఇస్తున్నాయి..!
దీపిక పదుకొణే 'చపాక్' సినిమాకి ప్రశంసలు తప్ప పెద్దగా ప్రాఫిట్స్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా బాగా ట్రెండ్ అయ్యింది. 'చపాక్' రిలీజ్‌కి ముందు దీపిక ఢిల్లీలోని జెఎన్‌యు యూనివర్శిటీకి వెళ్లింది. స్టూడెంట్ యూనియన్ గొడవల్లో ఒక వర్గానికి మద్దతుగా నిలిచింది. దీంతో కొంతమంది 'బాయ్‌కాట్ చపాక్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో హంగామా చేశారు. ఈ గొడవల్లోనే 2020 జనవరి10న థియేటర్లలో దిగింది 'చపాక్'.
ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తానాజీ కథాంశంతో వచ్చిన సినిమా 'తానాజీ-ది అన్‌సంగ్ వారియర్'. అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ ప్లే చేశాడు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. ఇక ఈ సినిమాలో తానాజీ వాస్తవ చరిత్రని దాచారని 'అఖిల భారతీయ క్షత్రియ కోలి రాజ్‌పుత్' సంఘం నిర్మాతపై కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సైఫ్ సినిమాలని రాజకీయాల్లోకి లాగొద్దని కామెంట్ చేశాడు. దీంతో ఈ వివాదం పెద్దదయి, 'తానాజీ' ట్రెండింగ్‌లోకి వెళ్లాడు. ఇక ఈ సినిమా 2020 జనవరి 10న రిలీజ్ అయింది.
బాలీవుడ్‌కి వెళ్లాక ఎప్పుడూ కాంట్రవర్శీస్‌తోనే ట్రావెల్ చేస్తోన్న తాప్సీ సినిమాలు కూడా వివాదమవుతున్నాయి. భార్యకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అనే పాయింట్‌తో వచ్చిన 'థప్పడ్' పై చాలా విమర్శలొచ్చాయి. భర్త చిన్న చెంపదెబ్బకొడితే భార్య విడాకులు తీసుకుంటుందా అని కొంతమంది, ఆత్మగౌరవం దెబ్బతింటే విడాకులు ఇస్తారని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఈ గొడవతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది 'థప్పడ్'. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్' సినిమా కూడా వివాదాలతోనే పబ్లిసిటీ చేసుకుంది. యుద్ధంలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ విమెన్ పైలట్ కథతో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'ఇది ఆడవాళ్లకు ఉద్దేశించిన ప్రదేశం కాదు' అనే డైలాగ్‌పై నిర్మాతలు, ఎగ్జిబిటింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌కి లేఖలు రాశాడు. కొంతమందైతే ఈ సినిమాని ఆపెయ్యాలని పోస్టులు పెట్టారు. ఈ గొడవలతోనే ఆగస్ట్12న రిలీజైన 'గుంజన్ సక్సేనా' ట్రెండింగ్‌లో నిలిచింది.