సినిమా విషయంలో మహేష్ ని బీట్ చేసిన పవన్ ఆ విషయంలో రెండవ స్థానంలో వుండిపోయాడు..
ఇక అసలు విషయానికి వస్తే...., ‘వకీల్ సాబ్’ సినిమా ఇంకా విడుదల కాకముందే ఓ సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. 2020లో అత్యధిక ట్వీట్లు ఏ దక్షిణాది హీరో గురించి, ఏ దక్షిణాది హీరోయిన్ గురించి చేశారు అనే విషయాలను ట్విట్టర్ ఇండియా సోమవారం ప్రకటించింది. అలాగే, ఏ దక్షిణాది సినిమా పేరుతో అత్యధిక ట్వీట్లు చేశారో కూడా సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ జాబితాలో తమిళ సినిమా ‘మాస్టర్’ మొదటి స్థానంలో ఉంది. #Master హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఏడాది ఈ సినిమా గురించి అత్యధిక ట్వీట్లు చేశారు.
ఇక ఆ మాస్టర్ సినిమా తరవాత స్థానంలో ‘వకీల్ సాబ్’ ఉంది. తెలుగు నుంచి అత్యధిక ట్వీట్లు చేసిన సినిమాగా ‘వకీల్ సాబ్’ రికార్డు సృష్టించింది. ఇక తెలుగులో వకీల్ సాబ్ సినిమా తరువాత స్థానంలో అత్యధిక ట్వీట్లు రాబట్టిన సినిమాగా సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" నిలిచి వుంది. ఈ రకంగా ‘వకీల్ సాబ్’ ట్విట్టర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.కాని సినిమా పరంగా మహేష్ ని బీట్ చేసిన పవర్ స్టార్ క్రేజ్ పరంగా బీట్ చెయ్యలేకపోయాడు. ఎక్కువ ట్వీట్లు అందుకొని నెంబర్ ఒన్ స్థానంలో నిలిచిన మహేష్ బాబు సోషల్ మీడియా కింగ్ అనిపించుకున్నాడు. కాని పవన్ మాత్రం మహేష్ తర్వాత స్థానాన్ని సరిపెట్టుకున్నాడు.ఏ విధంగా చూసుకున్న వీళ్లిద్దరికీ సాటి లేదు. ఫస్ట్ నుంచి కూడా వీళ్లిద్దరు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే..వీళ్ళ క్రేజ్ సముద్రం లాంటిది..
ఇక ట్విట్టర్లో ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్లు చేసిన సినిమాల వివరాలు చూసినట్లయితే .. 1. మాస్టర్, 2. వకీల్ సాబ్, 3. వలిమాయి, 4. సర్కారు వారి పాట, 5. సూరారై పోట్రు, 6. ఆర్.ఆర్.ఆర్ , 7. పుష్ప, 8. సరిలేరు నీకెవ్వరు, 9. కె.జి.యఫ్ ఛాప్టర్ 2, 10. దర్బార్. కాని ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన సినిమాలు రెండు ఉండటం అతని క్రేజ్ కి మరో నిదర్శనం. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...