ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..?
కియారా అద్వానీ హిందీ మూవీస్‌తో కెరీర్ స్టార్ట్ చేసినా, తెలుగు సినిమాతోనే భారీ సక్సెస్ వచ్చింది. 'ఫగ్లీ, మెషిన్' ఫ్లాపులతో స్లంపులో ఉన్న కియారాకి 'భరత్ అనే నేను' సూపర్ హిట్‌తో బ్రేక్ వచ్చింది. తర్వాత రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' సినిమా కూడా చేసింది. అయితే తెలుగు మూవీస్‌తో కొంచెం పాపులారిటీ రాగానే బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. తెలుగు సినిమాలు వైపు చూడకుండా ముంబయిలోనే మకాం పెట్టింది.
కియారా అద్వానీకి 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కభీర్ సింగ్'తో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఇక ఈ సక్సెస్‌తో హిందీలో వరుస సినిమాలకి సైన్ చేసింది. యంగ్‌స్టర్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లాంటి హీరోలతో స్టెప్పులేస్తోంది. ఇక ఇప్పుడు 'క్రిష్-4'లో హృతిక్ రోషన్‌తో రొమాన్స్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
పూజా హెగ్డే కూడా బాలీవుడ్ ఆఫర్లు చూసుకుని తెలుగు సినిమాలు తగ్గించింది. హృతిక్ రోషన్ 'మొహంజదారో'తో బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ టాలీవుడ్‌కి తిరిగొచ్చింది. ఇక్కడ 'అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో' హిట్స్ రాగానే మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. దీంతో హీరోయిన్లు బాలీవుడ్‌కే ప్రియారిటీ ఇస్తున్నారని, టాలీవుడ్‌ని స్టెఫినీగా చూస్తున్నారని కామెంట్ చేస్తున్నారు సినీజనాలు.
మొత్తానికి కొందరు హీరోయిన్ లు తెలుగు సినిమాలను అవకాశవాదంగా వాడుకుంటున్నారు. ఏ అవకాశాలు లేనపుడు తెలుగు సినిమాల్లో నటించడం.. బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చినపుడు తెలుగు సినిమాలను నెగ్లెట్ చేయడం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.