రాణా పుట్టినరోజుకు బాలకృష్ణ సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటీ..??

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలను ఎంచుకొని ..తన టాలెంట్ తో ఒకవైపు హీరోగా,మరోవైపు విలన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా.. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో పుట్టినరోజు ఈ రోజు..  1984 డిసెంబర్ 14న రానా భూమిపై కన్ను తెరిచాడు. ఆ రోజున రానా తాత డి.రామానాయుడుకు భలేగా కలిసొచ్చింది. అంతకు ముందు అనేక సూపర్ డూపర్ హిట్స్ అందించారు రామానాయుడు. 1983లో కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నాయుడు తీసిన మల్టీస్టారర్ 'ముందడుగు' బిగ్ హిట్. సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు. 1983లో చిరంజీవితో తీసిన 'సంఘర్షణ' యావరేజ్ గా ఆడింది.

దాంతో తరువాతి సంవత్సరం బాలకృష్ణ హీరోగా 'సంఘర్షణ' డైరెక్టర్ కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలోనే 'కథానాయకుడు' సినిమాను నిర్మించారు రామానాయుడు.కథానాయకుడు' 1984 డిసెంబర్ 14న విడుదలై విజయఢంకా మోగించి, సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అదే రోజున రామానాయుడు పెద్దకొడుకు సురేశ్ బాబుకు రానా పుట్టాడు.దాంతో దగ్గుబాటి ఫ్యామిలీలో లక్కీబాయ్ గా రానా పేరొందాడు. తన మనవడు రానా పుట్టినరోజునే సిల్వర్ జూబ్లీ హిట్ గా 'కథానాయకుడు'రావడం గురించి రామానాయుడు గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. తరువాతి రోజుల్లో తాను నిర్మించిన పలు చిత్రాలకు రానాతోనే క్లాప్ కానీ, కెమెరా స్విచ్చాన్ గానీ చేయించేవారు రామానాయుడు. అలా రానా పుట్టినరోజు నాడు మన నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించింది..

ఇక మన బర్త్ డే బాయ్ రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' అనే సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నివేత థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నక్సలైట్ గా కనిపించనున్నాడు రానా. ఇక రానాకి బర్త్ డే విషెస్ ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ చిన్న టీజర్ ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ టీజర్ కి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.ప్రస్తుతం షూటింగ్ ముగించుకొనున్న ఈ సినిమా వీలైనంత త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: